తిరుగులేని టాబ్లెట్ Samsung galaxy Tab S7+ రివ్యూ!

Samsung galaxy Tab S7+ రివ్యూ ఇప్పుడు చూద్దాం. అధికశాతం phone తయారీ సంస్థలు Android tabletల తయారీ నిలుపుదల చేయగా, ఎప్పటికప్పుడు అనేక కొత్త model tabletsని అందుబాటులోకి తీసుకొస్తున్న సంస్థ Samsung. అదే క్రమంలో ఆ సంస్థ తాజాగా అందుబాటులోకి తీసుకొచ్చిన అత్యంత శక్తివంతమైన Samsung Galaxy Tab S7+ ఏకంగా 71,999 రూపాయలకు విక్రయించబడుతోంది. Amazonలో 71,999 రూపాయలకి దీన్ని ఈ లింక్‌లో కొనుగోలు చేయొచ్చు.

Samsung galaxy Tab S7+ రివ్యూ – డిజైన్

Samsung galaxy Tab S7+

12.4 అంగుళాల Super AMOLED display కలిగి ఉండి, 120 Hz refresh rateతో, శక్తివంతమైన Qualcomm Snapdragon 865+ processorతో, Samsung Galaxy Note series phoneలలో లభించే విధంగా S-Pen కూడా దీనితో పాటు అందించబడుతుంది. వాస్తవానికి Galaxy Tab S7, Tab S7+ ఒకేసారి విడుదల చేయబడ్డాయి. వీటిలో ఇప్పుడు మనం చూస్తున్న S7+ అత్యంత శక్తివంతమైన specifications కలిగి ఉంటుంది. ఇంతకుముందే చెప్పుకున్నట్లు దీంట్లో 12.4 అంగుళా Super AMOLED displayతో, 1752×2800 pixels resolution, HDR10+ support లభిస్తుంటాయి. దీని చుట్టూ అంచులు చాలా పలుచగా ఉంటూ tablet చూడడానికి చాలా అధునాతనంగా ఉంటుంది. అలాగే పొరబాటున కూడా screenపై అంశాలను మన వేళ్లు touch చేయకుండా ఇది రూపొందించబడింది. Samsung సంస్థ ఈ tabletని landscape modeలో ఉపయోగించడానికి అనువుగా తయారుచేసింది. ఈ కారణం చేత selfie cameraని కుడి చేతి వైపు అమర్చడం జరిగింది.

గమనిక: Amazon, Flipkartలో లేటెస్ట్ డీల్స్, డిస్కౌంట్ పొందాలా? https://telegram.me/bestdealscera అనే ఛానెల్‌లో జాయిన్ అవండి. దీనికోసం మీ phoneలో Telegram యాప్ ఇన్‌స్టాల్ చేసుకుని ఆ లింక్ క్లిక్ చేయండి.

Samsung Galaxy Tab S7+లో మొత్తం నాలుగు speakers ఉంటాయి. వీటిలో రెండింటిని పైభాగంలోనూ, మరో రెండింటిని screen ఈ క్రింది భాగంలోనూ అమర్చారు. ఈ tablet, frameని metalతో రూపొందించడం వల్ల చూడటానికి చాలా premium look కలిగి ఉంటుంది. కుడి చేతి వైపు power, volume buttonలు, SIM Tray అందించబడ్డాయి. అలాగే ఎడమ చేతి వైపు compatible accessoriesని connect చెయ్యడానికి 3-pin connector అందించబడింది. Tablet వెనక భాగంలో ఎడమ చేతి వైపు రెండు camera modules లభిస్తుంటాయి. అలాగే S-Penని అమర్చడానికి కూడా magnetతో కూడిన అమరిక tablet వెనక భాగంలో ఉంటుంది. అలా అమర్చినప్పుడు ఆ pen దానంతట అదే charging అవుతుంది. Galaxy Tab S7+ 575 grams బరువు కలిగి ఉంటుంది. ఈ కారణం చేత ఒక చేత్తో ఉపయోగించడం కొద్దిగా కష్టమే. Tabletతో పాటు 10,090 mAh సామర్ధ్యం కలిగిన battery అందించబడింది. అలాగే 15W charger కూడా లభిస్తుంది.

Samsung galaxy Tab S7+ రివ్యూ – పనితీరు

Samsung galaxy Tab S7+

Samsung Galaxy Tab S7+లో HDR+ display, 120 Hz refresh rate ఉండటం వల్ల, screenపై దృశ్యాలు స్పష్టంగా ఉంటాయి. అలాగే మెరుగైన viewing anglesని కలిగి ఉంటుంది. మీ అభిరుచికి తగ్గట్లు color profile, color temperatureని మార్పిడి కూడా చేసుకోవచ్చు. నేరుగా సూర్యకాంతి కింద ఉపయోగించేటప్పుడు కూడా screenపై అక్షరాలు స్పష్టంగా కనిపించేటంత brightnessని ఇది అందిస్తుంది. అయితే screen కొద్దిగా reflectiveగా ఉంటుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న అత్యంత శక్తివంతమైన Snagit 865+ processor ఈ tabletని అగ్రస్థానంలో నిలబెడుతుంది. అలాగే 6GB RAM, 128GB internal storage, 1 TB వరకూ memory card support దీంట్లో లభిస్తున్నాయి. Bluetooth 5.0, dual-band wifi, 4G VoLTE, నాలుగు రకాల GPS systemలకు support మనకు అందుబాటులో ఉన్నాయి.

Galaxy Tab S7+లో in-display fingerprint sensor అందించబడింది. అది screen అడుగు భాగంలో అమర్చబడింది. అది CMOS కోవకు చెందిన sensor. గత సంవత్సరం విడుదలైన Galaxy Tab S6 మాదిరిగానే ఈ Tab S7+లో కూడా 3.5mm audio jack లభించడం లేదు. దానికి బదులు wirless earbuds ఉపయోగించాల్సి ఉంటుంది. Software విషయానికొస్తే Android 10 operating system ఆధారంగా పనిచేసే OneUI 2.5 దీంట్లో అందించబడింది. దీనిని tabletలో ఉపయోగించే విధంగా optimize చేయడంవల్ల చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. Screen పెద్దగా ఉండటం వలన ఒకేసారి రెండు appsని పక్కపక్కనే అమర్చుకుని ఉపయోగించుకోవచ్చు. రెండింటి కంటే ఎక్కువ appsని వాడాలంటే pop-up appగా కూడా open చేసుకోవచ్చు.

బ్యాటరీ బ్యాకప్

అదనంగా keyboard coverని ఉపయోగించటం ద్వారా Galaxy Tab S7+ని వాడడం మరింత సులువుగా ఉంటుంది. దీనిమీద laptopలో మాదిరిగా trackpad కూడా అందించబడింది. ఈ tablet పనితీరు విషయానికి వస్తే AMOLED display ఉండటం వల్ల videoలు పూర్తిస్థాయిలో ఆస్వాదించవచ్చు. ఏ సందర్భంలో కూడా tablet నెమ్మదించిన భావన కలుగదు. Tablet వెనక భాగంలో 13 మరియు 5 MP cameraలు లభిస్తున్నాయి. ముందు భాగంలో 5MP selfie camera ఉంటుంది. Video calling, zoom meetingsకి ఇది అనువుగా ఉంటుంది. Battery life విషయానికొస్తే నిరంతరాయంగా HD videoలను play చేసినప్పుడు 9 గంటల 46 నిమిషాల పాటు backup లభిస్తుంది. మామూలుగా పడితే మాత్రం కనీసం రెండు రోజుల పాటు battery backup పొందొచ్చు. పెద్దగా వాడుకొని లేకపోతే నాలుగైదు రోజులపాటు charging పెట్టాల్సిన అవసరం కలగదు. 30 నిమిషాల్లో 17 శాతం, గంటల 32 శాతం, మూడు గంటల్లో 100 శాతం charging పూర్తవుతుంది.

అత్యంత శక్తివంతమైన flagship స్థాయి Android tablet కోసం మీరు చూస్తున్నట్లయితే ఈ Samsung Galaxy Tab S7+ని ఇంటికి చేసుకోవచ్చు. ఇది ఖచ్చితంగా సంతృప్తికరమైన పనితీరును అందిస్తుంది. Flipkartలో 79,999 రూపాయలకి దీన్ని ఈ లింక్‌లో కొనుగోలు చేయొచ్చు. Amazonలో ధర ఎక్కువగా ఉంది.

8.5 Total Score
Samsung galaxy Tab S7+ రివ్యూ!

ఆండ్రాయిడ్ టాబ్లెట్లలో టాప్ మోడల్ Samsung galaxy Tab S7+ రివ్యూ పూర్తి వివరంగా ఇక్కడ చూద్దాం. దాని పనితీరు గురించి వివరాలతో!

డిజైన్
8
డిస్‌ప్లే
9
పెర్‌ఫార్మెన్స్
10
బ్యాటరీ లైఫ్
8
కెమెరా
7.5
వేల్యూ ఫర్ మనీ
8.5
PROS
  • Super AMOLED డిస్‌ప్లే.. భారీ స్క్రీన్ సైజ్
  • శక్తివంతమైన flagship ప్రాసెసర్
  • మంచి బిల్డ్ క్వాలిటీ
  • పవర్‌ఫుల్ బ్యాటరీ
CONS
  • ఎక్కువ ధర - అయినా ధరకి తగ్గ పనితీరు కలిగి ఉంటుంది
తెలుగు షాపింగ్
Logo