బెస్ట్ కంప్యూటర్ మోనిటర్ కొనాలని చూస్తున్నారా? చిన్న పరిమాణం కలిగిన మోనిటర్లు మల్టీటాస్కింగ్ కి చాలా ఇబ్బందిగా ఉంటాయి. ఈ నేపథ్యంలో 31 అంగుళాల కంటే ఎక్కువ పరిమాణం కలిగిన మానిటర్స్ మల్టీటాస్కింగ్ కోసం చాలా అనువుగా ఉంటాయి. వాటిలో బెస్ట్ మోడల్స్ ఇక్కడ చూద్దాం.
బెస్ట్ కంప్యూటర్ మోనిటర్ 1: LG Ultragear 32-inch Gaming monitor

ఆఫీస్ మరియు గేమింగ్ అవసరాల కోసం ఇది ఉపయోగపడుతుంది. AMD సంస్థ చేత అభివృద్ధి చేయబడిన Radon FreeSync టెక్నాలజీ కలిగి ఉండటం వలన 144 Hz వరకూ రిఫ్రెష్ రేట్ అందిస్తూ దృశ్యాలు స్మూత్ గా ఉండేలా ఇది చేస్తుంది. 2560×1440 పిక్సెళ్ల రిసల్యూషన్ కలిగి ఉండి 31.5 అంగుళాలు స్క్రీన్ పరిమాణం మీద కలిగి ఉంటుంది. స్క్రీన్ పరిమాణం ఇది కలిగి ఉంటుంది.
LG Ultragear 32-inch Gaming monitor
బెస్ట్ కంప్యూటర్ మోనిటర్ 2: LG 31.5 inch (80 cm) LED Monitor

డిస్ ప్లే టెక్నాలజీ లో LG చాలా సంవత్సరాలుగా అగ్రగామిగా ఉంటోంది. ఇది మెరుగైన రెస్పాన్స్ టైం కలిగి ఉంటుంది. రంగులు కూడా సహజసిద్ధంగా కనిపిస్తాయి. వ్యూయింగ్ యాంగిల్స్ మెరుగ్గా ఉండడం వల్ల అన్ని కోణాల నుండి స్క్రీన్ పై దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఆన్ స్క్రీన్ కంట్రోల్ ద్వారా మోనిటర్ కి సంబంధించిన వేల్యూమ్, బ్రైట్నెస్, పిక్చర్ మోడ్, screen split 2.0 వంటి అన్ని రకాల ఆప్షన్స్ మార్పిడి చేసుకోవచ్చు. స్క్రీన్ మీద ఏదైనా చదివేటప్పుడు రీడర్ మోడ్ సెలెక్ట్ చేసుకోవడం ద్వారా కళ్లపై ఒత్తిడి పడకుండా జాగ్రత్త తీసుకోవచ్చు.
LG 31.5 inch (80 cm) LED Monitor
బెస్ట్ కంప్యూటర్ మోనిటర్ 3: Dell 31.5 inch (80.01cm) Full HD Monitor

రోజువారి ఆఫీస్ మరియు ఇంటి అవసరాలకు, అలాగే క్యాజువల్ గేమింగ్ కోసం ఈ మోనిటర్ చక్కగా సరిపోతుంది. ఇది 60 Hz రిఫ్రెష్ రేట్ మాత్రమే కలిగి ఉంటుంది. ఫుల్ HD రిసల్యూషన్తో వస్తుంది. మనకు తగినంత బ్రైట్నెస్ ఈ మోనిటర్ అందిస్తుంది. కాంట్రాక్ట్ రేషియో కూడా బాగుంటుంది. అందుబాటులో ఉన్న వాటిలో బెస్ట్ IPS మోనిటర్గా దీన్ని భావించవచ్చు.