వైర్లెస్ ఇయర్ ఫోన్స్ JBL Tune 225TWS డీటైల్డ్ రివ్యూ!

JBL Tune 225TWS వైర్లెస్ ఇయర్ ఫోన్స్ డిజైన్

JBL Tune 225TWS వైర్లెస్ ఇయర్ ఫోన్స్ ఇటీవల మార్కెట్లోకి వచ్చాయి. వాస్తవానికి ఇటీవల కాలంలో wireless earphones వినియోగం బాగా పెరిగింది. అనేక కంపెనీలు ఎప్పటికప్పుడు ఈ విభాగంలో కొత్త models విడుదల చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో JBL సంస్థ 8,299 రూపాయలకు విడుదలచేసిన Tune 225TWS earbuds పనితీరు ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. వాస్తవానికి ఈ మధ్య OnePlus, Lypertek వంటి అనేక కొత్త brands అందుబాటులోకి వచ్చినా ఇప్పటికే తమకంటూ ఒక ప్రత్యేకత కలిగి ఉన్న JBL అన్ని రకాలుగా మెరుగ్గా ఉంటుంది. అద్భుతమైన శబ్ద నాణ్యతను ఈ earbuds అందిస్తుంది. అమెజాన్‌లో ఈ లింకులో ఈ earbuds కొనుగోలు చేయొచ్చు.

Wireless earbuds కొనుగోలు చేసేటప్పుడు చాలామంది చెవిలో పూర్తిగా ఇమిడిపోయే in-canal fitలను ఎంపిక చేసుకుంటూ ఉంటారు. వాటివల్ల ప్రత్యేకంగా ప్రయోజనం ఉన్నప్పటికీ, JBL Tune 225TWSలో అనుసరించబడిన Outer-ear fit వల్ల కూడా కొన్ని ప్రయోజనాలు ఉంటాయి. మరింత అదనంగా సౌకర్యం లభించడంతోపాటు, చుట్టూ పరిసరాల శబ్దాలు కూడా వినిపించటం వల్ల ప్రమాదాలు జరగకుండా ఉంటాయి. అలాగే ఈ earbuds చాలా తేలికగా ఉంటాయి. ముఖ్యంగా చెవులు ధరించినప్పుడు వాటిని పెట్టుకున్నట్లు కూడా ఎదురుగా చూసేవాళ్ళకు అంత సులభంగా కనిపించదు.

గమనిక: Amazon, Flipkartలో లేటెస్ట్ డీల్స్, డిస్కౌంట్ పొందాలా? https://telegram.me/bestdealscera అనే ఛానెల్‌లో జాయిన్ అవండి. దీనికోసం మీ phoneలో Telegram యాప్ ఇన్‌స్టాల్ చేసుకుని ఆ లింక్ క్లిక్ చేయండి.

చుట్టూ ఉండే పరిసరాల శబ్దాలను అవసరం మేరకు వినిపించటం మాత్రమే కాకుండా, passive noise isolation సదుపాయాన్ని కూడా ఇవి కలిగి ఉంటాయి. JBL Tune 225TWS charging case చాలా చిన్న పరిమాణం కలిగి ఉండటం వల్ల సులభంగా జేబులో ఇమిడిపోతుంది. Charging కోసం దీనిమీద usb type c port అందించబడింది. అలాగే battery ఇంకా ఎంత మిగిలి ఉంది అన్నది చూపించే విధంగా battery indicator lights లభిస్తాయి. Eearpieceల మాదిరిగానే case కూడా plasticతో రూపొందించబడి ఉంటుంది. అయినప్పటికీ ఇది మెరుగైన build quality కలిగి ఉంటుంది.

JBL Tune 225TWS True Wireless in-Ear Headph

JBL Tune 225TWS వైర్లెస్ ఇయర్ ఫోన్స్ – ఆప్షన్స్ ఇలా..

10 వేల రూపాయల ధరలో లభించే ఇతర wireless earbudsలో touch controls లభిస్తుంటే, ఈ modelలో మాత్రం పాత కాలంలో మాదిరిగా physical buttonలను అందించారు. ఇది కొంత వరకు నిరుత్సాహపరుస్తుంది. మరీ ముఖ్యంగా వీటిని మనకు కావాల్సినట్లు customize చేసుకోవడానికి సాధ్యపడదు. అలాగే settingsని మన smartphone నుండి మార్పిడి చేసుకోవటానికి ఎలాంటి companion app కూడా అందించబడడం లేదు. Earbuds కిందిభాగంలో లభించే buttons ఆధారంగా configuration చేసుకోవడం కొద్దిగా కష్టంగా ఉంటుంది. ఎడమ చేతి వైపు ఉన్న earpiece మీద ఒకసారి press చేస్తే తర్వాతి trackకి వెళ్లడానికి సాధ్యపడుతుంది.

రెండుసార్లు tap చేస్తే మునుపటి trackకి చేరుకుంటాం. కుడి చేతి వైపు ఉన్న earpiece మీద ఒకసారి tap చేస్తే play, pause activate అవుతుంది. Double tap చేస్తే.. defaultగా set చేయబడి ఉన్న voice assistant activate అవుతుంది. దానికి మనం voice commands ఇవ్వొచ్చు. అలాగే ఏదైనా phone call వచ్చినప్పుడు ఏ earpiece మీద అయినా single-tap చేస్తే సరిపోతుంది, call attend అవుతుంది. దాని మీద long-press చేసినప్పుడు power, pairing సదుపాయాలు లభిస్తాయి. ఈ combinationsని గుర్తుపెట్టుకోవడానికి కొంత సమయం పడుతుంది.

ఫాస్ట్ పెయిరింగ్

JBL Tune 225TWSలో Bluetooth 5 technology ఉపయోగించబడింది. అలాగే ఇది SBC, AAC bluetooth codecలను కలిగి ఉంటుంది. 20-20000 Hz frequency responseని ఈ earphone కలిగి ఉంటుంది. Compatible అయ్యే smartphoneలు, computerల వంటి వాటికి వేగంగా connect అవ్వడం కోసం Google Fast Pair అనే technology కూడా support చేయబడుతుంది. అలాగే మీ అవసరాన్ని బట్టి ఒకసారికి ఒక earpieceని మాత్రమే వాడుకునే వెసులుబాటు లభిస్తుంది. ఈ Wireless earbudsలో Dust, water resistance సదుపాయాలు లేవు. కాబట్టి మీ జాగ్రత్తలో మీరు ఉండటం మంచిది.

పనితీరు

JBL Tune 225TWSలో 5 గంటల పాటు battery backup లభిస్తుంది. అలాగే charging case ద్వారా మరో నాలుగు సార్లు charging చేసుకోవచ్చు. అంటే సుమారు 20 నుంచి 21 గంటల పాటు సగటున charging పొందొచ్చు అన్నమాట. JBL సంస్థ వినియోగదారుల ఆదరణ చూరగొనడానికి ప్రధాన కారణం మెరుగైన శబ్ధ నాణ్యత అందించడం! అదే రకమైన నాణ్యతని ఈ JBL Tune 225TWS కలిగి ఉంటుంది.

అయితే అధునాతన bluetooth codecలకు మాత్రం దీనిలో support లేదు. సరిగా tuning చేయగలిగితే వీటి నుండి మెరుగైన ఫలితాలు పొందవచ్చు. మీ దగ్గర high-resolution కలిగివున్న audio trackలు ఉన్నట్లయితే వాటి ద్వారా మెరుగైన శబ్దాన్ని పొందొచ్చు. అయితే Spotify, Youtube వంటి online streaming serviceలలో compressed audio మాత్రం అంత గొప్పగా అనిపించదు. High, low volumeలలో ఒకే మాదిరి శబ్ద నాణ్యతను ఇవి కలిగివుంటాయి.

సౌకర్యవంతంగా ఉంటూ, మెరుగైన battery backup, శబ్ద నాణ్యత అందించే విధంగా మంచి పేరున్న సంస్థ నుండి wireless earbuds కొనుగోలు చేయాలంటే ఈ JBL Tune 225TWS వైర్లెస్ ఇయర్ ఫోన్స్ ఎంపిక చేసుకోవచ్చు. అయితే touch controls, అధునాతన bluetooth codecs, app support వంటివి కావాలంటే మాత్రం ఇతర models మెరుగ్గా ఉంటాయి. అమెజాన్‌లో ఈ లింకులో ఈ earbuds కొనుగోలు చేయొచ్చు.

8.2 Total Score
JBL Tune 225TWS వైర్లెస్ ఇయర్ ఫోన్స్ డీటైల్డ్ రివ్యూ!

ఆడియో క్వాలిటీ కోసమే అయితే ఖచ్చితంగా కొనొచ్చు.. టచ్ కంట్రోల్స్ ఉంటే బాగుండేది.

బిల్డ్ క్వాలిటీ
7.5
ఆడియో క్వాలిటీ
9
వేల్యూ ఫర్ మనీ
8
PROS
  • చెవులపై వత్తిడి పడకుండా తేలిగ్గా ఉంటాయి
  • వేగంగా పెయిర్ అవడానికి Google Fast Pair టెక్నాలజీ వాడబడింది
  • ఛార్జింగ్ కేస్‌తో కలిసి 20-21 గంటల బ్యాటరీ బ్యాకప్
  • హై-క్వాలిటీ ఆడియో అద్భుతమైన నాణ్యతతో విన్పించబడుతుంది
CONS
  • డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ లేదు
  • టచ్ కంట్రోల్స్‌కి బదులు ఫిజికల్ బటన్స్ మాత్రమే అందించబడ్డాయి

తెలుగు షాపింగ్
Logo