OnePlus Buds Z డీటెయిల్డ్ రివ్యూ! కొనొచ్చా లేదా?

ఈ మధ్యకాలంలో Wireless earbuds వినియోగం బాగా పెరిగింది. Smartphone తయారీలో పేరెన్నికగన్న సంస్థ OnePlus కూడా ఇయిర్ బర్డ్స్ విడుదల చేసిన విషయం తెలిసిందే. Amazonలో రూ. 2,999కి ఈ లింక్‌లో వీటిని కొనుగోలు చేయొచ్చు.

డిజైన్

OnePlus Budsలో ఇయర్ టిప్స్ విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవటం జరిగింది. అవి చెవిలో మెరుగ్గా అమరడమే కాకుండా, పాసివ్ నాయిస్ ఐసోలేషన్ సమర్థవంతంగా చేయగలుగుతున్నాయి. ఇవి పూర్తిగా ప్లాస్టిక్తో తయారు చేయబడి గ్లాస్ మాదిరిగా కనిపించే కోటింగ్ వేయబడి ఉంటాయి. ఒక్కొక్కటి కేవలం ఐదు గ్రాముల బరువు మాత్రమే ఉండటం వల్ల ఎక్కువసేపు ధరించినా కూడా చెవుల పై ఎలాంటి ఒత్తిడి ఉండదు. అయితే ఒకే ఒక అసౌకర్యం ఏంటంటే ఇయర్ పీసెస్ స్వల్పంగా బయటకు వచ్చినట్లు ఉంటాయి. ఇయర్ బడ్స్ మాదిరిగానే కేస్ కూడా ప్లాస్టిక్ తో రూపొందించబడి ఉంటుంది. ఛార్జింగ్ కోసం usb type c port దానిమీద కల్పించబడి ఉంటుంది.

గమనిక: Amazon, Flipkartలో లేటెస్ట్ డీల్స్, డిస్కౌంట్ పొందాలా? https://telegram.me/bestdealscera అనే ఛానెల్‌లో జాయిన్ అవండి. దీనికోసం మీ phoneలో Telegram యాప్ ఇన్‌స్టాల్ చేసుకుని ఆ లింక్ క్లిక్ చేయండి.

కేస్ మూత తీసిన క్షణంలోనే, మీరు ఏ ఫోన్ కైతే పెయిరింగ్ చేసి ఉంటారో దానికి ఇయర్ బడ్స్ ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోతాయి. ఇది కచ్చితంగా ఆశ్చర్యపరుస్తుంది. అలాగే రెండు వైపులా ఇయర్ బడ్స్ మీద టచ్ ఆధారంగా పనిచేసే కంట్రోల్స్ అందించబడ్డాయి. వీటిని మనకు నచ్చినట్లుగా Hey Melody అనే ఆండ్రాయిడ్ అప్లికేషన్ ద్వారా కష్టమైజ్ చేసుకోవచ్చు. ఈ అప్లికేషన్లో built-in ఈక్వలైజర్ కూడా లభిస్తుంది.

ఒక ఇయర్ బడ్ చెవిలో నుండి బయటకు తీసిన వెంటనే అప్పటివరకు ప్లే అవుతున్న మ్యూజిక్ ఆగిపోతుంది. మళ్లీ చెవిలో పెట్టుకున్న తర్వాత మాత్రమే మ్యూజిక్ కంటిన్యూ అవుతుంది. IP 55 రేటింగ్ కలిగి ఉండటం వలన జిమ్ చేసేటప్పుడు గానీ, వాకింగ్ చేసేటప్పుడు గానీ చెమట వల్ల ఇయర్ బడ్స్ పాడవుతాయి అని ఆందోళన చెందాల్సిన పనిలేదు.

సౌండ్ క్వాలిటీ

సౌండ్ క్వాలిటీ బాగా లేకపోతే ఎంత మంచి కంపెనీ ఇయర్‌బడ్స్ అయినా నిరుపయోగమే. అయితే OnePlus Buds Z సౌండ్ క్వాలిటీ విషయంలో సంతృప్తికరమైన ఫలితాలు అందిస్తాయి. 10mm డైనమిక్ డ్రైవర్లను ఇది కలిగి ఉంటాయి. బ్లూటూత్ 5 ఆధారంగా పనిచేసే ఈ ఇయర్ బడ్స్ SBC, AAC ఆడియో కొడెక్‌లను సపోర్ట్ చేస్తాయి. అధిక శాతం ఉంది యూజర్లను సంతృప్తిపరచడం కోసం ఈ ఇయర్‌బడ్స్‌ని రూపొందించినట్లు స్పష్టంగా తెలుస్తుంది. అందుకే ఇవి బాస్ ఫార్వార్డ్ సౌండ్ సిగ్నేచర్ కలిగి ఉంటాయి. కొన్ని సందర్భాలలో బీట్స్ ఓకల్స్‌ని డామినేట్ చేసే అవకాశం కూడా ఉంది. అయితే కేవలం ఆడియో రంగంలో నిపుణులైన వారు మాత్రమే ఈ విషయాన్ని గమనించగలుగుతారు. మామూలు సందర్భాలలో ఏ మాత్రం ఇబ్బంది అనిపించదు. కచ్చితంగా ఈ ధరలో తగినంత శబ్ద నాణ్యత లభిస్తుంది.

బ్యాటరీ లైఫ్, కనెక్టివిటీ

ఒక్కసారి చార్జింగ్ చేస్తే ఐదు గంటలపాటు బ్యాటరీ బ్యాకప్ లభిస్తుందని OnePlus సంస్థ చెబుతున్నప్పటికీ, నాలుగు గంటల పాటు నిక్షేపంగా బ్యాటరీ బ్యాకప్ లభిస్తోంది. అలాగే ఛార్జింగ్ కేస్ ద్వారా మొత్తం 20 గంటల బ్యాటరీ బ్యాకప్ పొందగలుగుతాం. కేవలం పది నిమిషాలు ఛార్జింగ్ చేస్తే చాలు, మూడు గంటల పాటు పాటలు వినగలిగేటంత బ్యాకప్ లభిస్తుంది. ఒక్కో ఇయర్‌బడ్‌లో రెండు మైక్రోఫోన్స్ పొందుపరచబడ్డాయి. ఈ కారణం చేత మీరు మాట్లాడే ఫోన్ కాల్స్ చాలా స్పష్టంగా ఉంటాయి.

కొనచ్చా లేదా?

OnePlus Buds Z రెండో ఆలోచన లేకుండా తీసుకోవచ్చు. వీటి కంటే మరింత మెరుగైన ఆప్షన్ కావాలంటే Oppo Enco W31ని ఎంపిక చేసుకోవచ్చు.

9.5 Total Score
OnePlus Buds Z డీటెయిల్డ్ రివ్యూ! కొనొచ్చా లేదా?

OnePlus Buds Z రెండో ఆలోచన లేకుండా తీసుకోవచ్చు.

బిల్డ్ క్వాలిటీ
9
వేల్యూ ఫర్ మనీ
8.5
PROS
  • బెస్ట్ క్వాలిటీ
  • తక్కువ బడ్జెట్‌లో లభిస్తాయి..
  • మంచి కంపెనీ నుండి లభిస్తాయి.
CONS
  • పెద్దగా ఏమీ లేవు.

తెలుగు షాపింగ్
Logo